శశికుమార్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

58చూసినవారు
శశికుమార్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి
ఏలూరు నగరంలోని స్థానిక అమీనాపేట స్వామి దయానంద సరస్వతి వసతి గృహంలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన శశి కుమార్ ని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (NFIW), ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశాయి. గురువారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ కు వారు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఇకనైనా తక్షణం స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్