ది. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్
డో.నెం. 15-4-3, బాపూజీ నగర్, కొవ్వూరు-534350, ప.గో. జిల్లా.
101వ వార్షిక మహాజన సభ నోటీసు
బ్యాంకు యొక్క 101వ వార్షిక మహాజన సభ 29-09-2020, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బ్యాంకు దగ్గర కోవిడ్ నిబంధనలననుసరించి జరుపుటకు నిర్ణయించడమైనది. కావున ‘ఏ తరగతి సభ్యులు’ తప్పక విచ్చేయవలసినదిగా ఆహ్వానించడమైనది.
చర్చనీయాంశములు:
1.బ్యాంకు యొక్క 2019-2020 సంవత్సర వార్షిక నివేదిక ఆమోదించుట.
2.బ్యాంకు స్టాట్యూటరీ ఆడిటర్ వారిచే జారీచేయబడిన 2019-2020 సంవత్సరపు ఆడిట్ రిపోర్టు, ఆస్తి అప్పుల పట్టిక, లాభ నష్టముల ఖాతా, జమాఖర్చులు ఆమోదించుట గురించి.
3.2019-2020 సహకార సంవత్సరంలో ఆడిట్ రిపోర్టు ప్రకారము బ్యాంకుకు వచ్చిన నికర లాభమును బైలాలో నం.43 మరియు సహకార సంఘముల చట్టం ప్రకారం పంపిణీ చేయుట గురించి.
4.2019-2020 సంవత్సరమునకు గాను సభ్యుల పేరు ధనముపై రిజర్వు బ్యాంకు వారి అనుమతి మేరకు 15 శాతం డివిడెండును పంపిణీ చేయుట గురించి.
5.2019-2020 సంవత్సరములో అంచనా బడ్జెట్ కు మించి కాబడిన ఖర్చులు రెటిఫై చేయుట గురించి.
6.2019-2020 సంవత్సరమునుకు అంచనా(రివైజ్డ్) బడ్జెట్ ఆమోదించుట గురించి.
7. పాలకవర్గముచే 01-03-2020 తేదీ నుంచి 05-09-2020 తేదీ వరకు బ్యాంకు నందు సభ్యులుగా చేర్చుకొనబడిన చర్యను, పేరుధనం వాపసు ఇచ్చిన చర్యను, షేరు ట్రాన్స్ఫర్ అనుమతించిన చర్యను మరియు సభ్యులకు అదనపు షేర్లు కేటాయించిన చర్యను ఆమోదించుట గురించి.
8.బ్యాంకు 2019-2020 సంవత్సరమునకు ఫైనల్ ఆడిట్ నిర్వహించుటకు చార్టర్డ్ అకౌంటెంట్ ను నియమించుట గురించి.
9.31-08-2020 నాటికి బ్యాంకు పాలకవర్గము వారిచే సభ్యులకు మంజూరు చేసిన వివిధ అప్పులను పరిశీలించి ఆమోదించుట గురించి.
10.31-08-2020 నాటికి నిలిచియున్న వాయిదా మీరిన బాకీదారుల జాబితాను సభ్యుల పరిశీలన నిమిత్తము ఉంచుట గురించి.
11. స్థిరాస్థి హామీపై అప్పు పొందిన ఖాతాదారులు సకాలములో చెల్లించిన వారికి వడ్డీ 2 శాతం రాయితీ(తగ్గింపు) ఇచ్చుచున్న చర్యను ఆమోదించుట మరియు ఇట్టి రాయితీని కొనసాగించుటకు పాలకవర్గము తీసుకుకన్న చర్యను ఆమోదించుట గురించి.
12. బ్యాంకు సిబ్బంది జీతభత్యముల పెంపుదల విషయము పరిశీలించుట గురించి.
13.రిజర్వు బ్యాంక్ వారి మాస్టర్ సర్కులర్ BPD(PCB).Cir.No.07/09.09.002/2017-18Dt10-05-2018 ననుసరించి వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత రంగములకు కూడా రుణములను మంజూరు చేయుట గురించి పాలకవర్గము వారు ఆమోదించిన తీర్మానమును రాటిఫై చేయుట గురించి.
14. చైర్మన్ గారిచే ప్రవేశపెట్టబడు ఇతర విషయములు.
పాలకవర్గము వారి అనుమతితో..
ఏ.విజయభాస్కరరావు, కార్యదర్శి ఇన్ చార్జి
మద్దిపట్ల శివరామకృష్ణ
M.com,అధ్యక్షులు
కొవ్వూరు,
11-09-2020,
గమనిక:- మహాజన సభకు హాజరగు సభ్యులు ప్రతీ ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించవలెను.