‘కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి‘

852చూసినవారు
‘కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి‘
జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జరుగుతున్న పనులను మంగళవారం డిఆర్ఓ వి. డేవిడ్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. కలెక్టరేట్ పరిసరాల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పరిసరాలను సర్వాంగ సుందరంగా అందరినీ ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, పచ్చని పూల మొక్కలతో పార్కు, రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు నాటుతున్నామన్నారు.

అధిక వర్షాలకు తరుచూ ముంపునకు గురవుతున్న కలెక్టరేట్ లోని చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలను మెరక చేస్తున్నామని, ఇందుకు నగరపాలక సంస్థ జెసిబి, శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నట్లు డిఆర్ఓ తెలిపారు.

ట్యాగ్స్ :