పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు నిరుద్యోగలకు శుభవార్త చెప్పారు. గురువారం ఉదయం 10:00 గంటలకు అంబేద్కర్ భవన్ లో మెగా జాబ్ మేళా ఆయన ప్రారంభిస్తారు. ఈ జాబ్ మెళా నెల్లూరు శ్రీ సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఇ మెగాజాబ్ మేళా ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కోరారు.
7 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్, డిగ్రీ టెక్నీకల్ కోర్సులు, బి.ఫార్మసీ అర్హత ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు గురువారం ఉదయం 10 గంటలకు నర్సాపురం థామస్ వంతెన ఎదురుగా గల అంబేద్కర్ భవనంలో జరిగే మెగాజాబ్ మేళాకు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని తెలియని వారికి తెలియపరచమని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కోరారు.