పాలకొల్లులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

177చూసినవారు
పాలకొల్లులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పాలకొల్లు నియోజకవర్గంలో నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు పలు ప్రాంతాలలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపారు. తొలుత పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు షేక్ మహ్మద్ జానీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శివాజీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ కమిటీ కార్యాలయమైన గాంధీ భవన్ వద్ద రొక్కాల బెన్ని పాల్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఎడ్ల బజారు సెంటర్ వద్ద పీసీసీ సభ్యులు షేక్ మహమ్మద్ జాని స్వంతంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ ప్లెక్సీ వద్ద జానీ పూలమాల వేసి స్థానికులకు పండ్లు పంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్