
పాలకొల్లు: శ్రీ అంకాలమ్మతల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ
పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ అంకాలమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవం గురువారం అత్యంత వైభావంగా జరిగింది ఈజాతరలో ముఖ్య అతిథులుగా టీటీడీ దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డీంచారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు