కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, కాలువల వద్ద పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వారు సూచించే నిబంధనలు భక్తుల రక్షణ, భద్రత కోసమేనని చెప్పారు.