ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల వెనుక ఉన్న సారా తయారీ కేంద్రాలపై పోలీసులు ఆదివారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిపిన దాడిలో 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటు సారా తయారీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.