గత ప్రభుత్వం చేతగాని తనం వల్లే నేటికీ టీడ్కో హౌస్ లు మంజూరు చేయలేకపోతున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం టీడ్కో గృహ సముదాయంలో ఆయన పర్యటించారు. ఆరు కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో మురుగు నీటి ప్రవాహానికి సంబంధించిన సీనరీజ్ ట్యాంక్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల గుర్తించకుండా తెలుగుదేశం ప్రభుత్వం కేవలం తమ జేబులు నింపుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో పెద్ద మనసుతో తాడేపల్లిగూడెంలో 60 ఎకరాల స్థలాన్ని పేదల కోసం కేటాయిస్తే చంద్రబాబు నాయుడు దాంట్లో బిల్డింగులు కట్టి ప్రజల సొమ్ము కాజేయాలనుకున్నాడు. ఎన్నికల నాటికి ఏదో విధంగా ప్రజలు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ లు చూపించి ప్రజల మోసం చేద్దాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట పై విశ్వాసంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి కి పట్టం కట్టారని ఆయన అన్నారు. తాడేపల్లి గూడెం లో నిర్మించిన ఈ గృహ సముదాయం సంబంధించిన మురుగునీరు ఎటు వెళ్తుంది అనేదానిపై ఇక్కడ పాలకులకు కనీస అవగాహన లేదన్నారు 5 వేలకు పైగా కుటుంబాలు ఒక్కచోట నివాసముంటే వారి కనీస బాధ్యత ప్రజా ప్రతినిధులు తమ జోబులు నింపుకోవడానికి చూశారే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఘాటు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఈ గృహ సముదాయం యొక్క అవుట్లెట్ సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశామని ఇక్కడ పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి కి మున్సిపల్ శాఖ మంత్రికి తెలియజేసి ప్రత్యేక నిధుల ద్వారా ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈరోజు కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో ఈ గృహ సముదాయం తాడేపల్లిగూడెం పట్టణానికి తలమానికం కానుందని అన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రీ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.