తణుకులో 20 అడుగుల భారీ గణనాథుడు

57చూసినవారు
తణుకులో 20 అడుగుల భారీ గణనాథుడు
వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకుని తణుకు పట్టణంలో విఘ్నేశ్వర స్వామి ఆలయాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా కొచ్చర్లకోట వారి వీధిలో కొలువు తీరుతున్న గణనాథుని విగ్రహం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి 20 అడుగుల భారీ గణనాథుని విగ్రహాన్ని తీసుకువచ్చి నవరాత్రులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్