మండపాక గ్రామంలో పారిశుద్ధ్య పనులు

83చూసినవారు
మండపాక గ్రామంలో పారిశుద్ధ్య పనులు
తణుకు మండలం మండపాక గ్రామంలో గురువారం పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో యాంటీ లార్వా స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జానా వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ వట్టికూటి శివ నాగ ప్రసాద్, హెల్త్ సిబ్బంది ప్రవీణ, సంధ్య, అనురాధ, విక్టోరియా, వై. టి మూర్తి, శానిటరీ మేస్త్రి విజయ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్