"జగన్ రాసిచ్చారు. బాబు ఏం చేస్తారు? " అంటూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అస్మదీయులకు హైడెల్ ప్రాజెక్టులు సహా వేల ఎకరాలు కేటాయించడంపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై సవివరంగా కథనం ప్రచురించిన ఒక దినపత్రిక యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు.