గుంతలతో ఉన్న రోడ్లను గుంతలు లేని రోడ్ల బాగు చేసేందుకు రూ.826 కోట్లు కేటాయించిన నారా చంద్రబాబు నాయుడుకి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో రహదారి మరమత్తుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే జిల్లాలో సమాంతరంగా రోడ్లను మరమ్మత్తులు చేపట్టే విధంగా కార్యచరణ రూపొందించమన్నారు.