నిడమర్రు గ్రామంలో శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అయినా నేపథ్యంలో స్వామి వారిని క్షమాపణ కోరటం జరిగింది. అనంతరం విచ్చేసిన భక్తులకు ఎమ్మెల్యే అన్న ప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.