గణపవరం మండలం కాశిపాడు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మంగళవారం చింత వెంకట చరణ్ కుమార్ నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సముద్రపు తరుణ్, నాగరాజు పేర్లను ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ధర్మరాజు ప్రకటించారు. ఎన్నికైన ఇతర కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు.