భీమడోలు: పింఛన్ల పంపిణీలో పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షుడు
భీమడోలు రావిచెట్టు సెంటరులో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.