పూళ్ళ శాఖా గ్రంధాలయంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులు

478చూసినవారు
పూళ్ళ శాఖా గ్రంధాలయంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులు
భీమడోలు మండలం పూళ్ళ శాఖా గ్రంధాలయంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులు రెండవ రోజు బుధవారం ఘనంగా జరిగాయి. గ్రంధపాలకులు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలకు చెందిన బాల బాలికలు గ్రంధాలయంలోని నీతి కధల పుస్తకాలను చదివి తోటి చిన్నారులకు చెప్పి తమ నైపుణ్యాలు, ప్రతిభను చాటారు. సోషల్ వర్కర్ గేదెల ఈశ్వరి భగవత్గీత స్లో వినిపించారు. చిన్నారులు మంత్రముగ్దులైయ్యారు. పుస్తక సమీక్షలు రాసారు. అనంతరం చెస్ పై శిక్షణ మిచ్చారు. పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీర్స్ పీ. కిషోర్, రహీం, పెద్దలు శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్