అతిధి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు
బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో గెస్ట్ టీచర్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి ధాత్రిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.