ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు రాకపోకల బంద్
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామ శివారులో ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గత నాలుగు రోజులుగా ఏజెన్సీలా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై వాగు పొంగిపొర్లడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ప్రజలు వాగులు దాటడం వంటి ప్రయత్నాలు చేయవద్దని అధికారులు సూచించారు.