వర్షాలతో నీట మునుగుతున్న పాఠశాల ప్రాగణం
దేవరపల్లి భాష్యం పాఠశాల పరిసర ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది. వర్ష ప్రభావంతో సమయం గడిచే కొద్ది ఉద్రిక్తత పెరుగుతుంది. పాఠశాల ముందువైపు రోడ్డు మొత్తం జలమయంగా మారిపోవడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.