Dec 01, 2024, 01:12 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఆదిలాబాద్: విజయోత్సవములను జయప్రదం చేయాలి
Dec 01, 2024, 01:12 IST
ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ పై శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ ఘనంగా నిర్వహించాలన్నారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన తేదీల్లో ప్రణాళికాబద్ధంగా వారి శాఖల ద్వారా కార్యక్రమాలను నిర్వహించి రోజువారీ నివేదికలను డాక్యుమెంటరీ ద్వారా సమర్పించాలని ఆదేశించారు.