రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.7,500 'రైతుభరోసా'ను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటివరకు అమలు చేయలేదు. నిన్న పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రైతు భరోసాపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తారని భావించినా అదీ జరగలేదు. సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసా నిధులను పక్కనబెట్టేసినట్లేననే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రైతులు బోనస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడంతో రైతుభరోసాపై అయోమయం నెలకొంది.