లింగపాలెంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు
లింగపాలెం మండలం వేములపల్లి గ్రామ పంచాయతీలో సీసీ రహదారి నిర్మాణ పనులు శుక్రవారం శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రూ. 40 లక్షల వ్యయంతో ఇటీవల గ్రామంలో నిర్మాణ పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ నత్తా దివ్య నాగేంద్ర మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.