లింగపాలెం: ఐదేళ్ల తర్వాత రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం
లింగపాలెం మండలంలో కె. గోకవరం గ్రామంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రోడ్లు మరమ్మతు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటిసారిగా చేపట్టనున్న పల్లె రహదారులకు మోక్షం లభించిందన్నారు. సంక్రాంతి నాటికి రోడ్లు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.