Nov 22, 2024, 16:11 IST/
అదుపు తప్పిన చేపల లారీ.. ఎగబడ్డ జనం
Nov 22, 2024, 16:11 IST
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్లో చేపల లారీ ప్రమాదానికి గురైంది. గ్రామ సమీపంలోని మార్కెట్కు చేపల్ని తరలిస్తున్న ఓ టెంపో లారీ వేగంగా వెళ్తూ అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో టెంపోలోని చేపలన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. బతికున్న చేపల కోసం ప్రజలు పోటీపడ్డారు.పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఒక్కటి కూడా వదలకుండా ఎవరికి అందినకాడికి వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.