పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు సమీపంలో బుధవారం ఓ కాలేజీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు పది మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షగాత్రులను ముందుగా పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.