లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్ పేటకు చెందిన పొన్నం బాలమల్లు (66) తన మనమరాలి పుట్టినరోజుకు వేడుకల నిర్వహణపై ఈనెల 10 న చర్చించే క్రమంలో కొడుకుతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం దండేపల్లి మండలం రెబ్బనపల్లి శివారులో బాలమల్లు మృతదేహం లభ్యమైందని, అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.