పెనుమంట్ర: అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు
పెనుమంట్ర మండలం పంపనవారి పాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంకి ముఖ్య అతిధిగా విచ్చేసిన సీడిపిఓ కృష్ణ కుమారి కిశోర బాలికల అభివృద్ధి కొరకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం లో సూపర్ వైజర్ వరలక్ష్మి, అంగన్వాడీ వర్క్రర్స్ శాంతకుమారి, రాజేశ్వరి, సాయిమహాలక్ష్మి, పద్మావతి, శ్రీదేవి, పిల్లల తల్లులు పాల్గొన్నారు.