Sep 26, 2024, 16:09 IST/
పొలాల విషయంలో కర్రలతో దాడి .. వ్యక్తి మృతి (వీడియో)
Sep 26, 2024, 16:09 IST
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఆమ్ఖేడి గ్రామంలో పొలాల విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. గ్రామపెద్ద రవీంద్ర పక్షంపై అదే గ్రామానికి చెందిన జోగేంద్ర తదితరులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆజాద్ అనే వ్యక్తి మృతి చెందగా, 8 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.