భక్తులను క్యూలైన్‌లోకి ఒకేసారి ఎందుకు వదిలారు?: పవన్

58చూసినవారు
AP: తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బైరాగిపట్టెడ పద్మావతి పార్కును ఆయన పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే వివరాలను జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్‌కు వివరించారు. భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి ఎందుకు వదిలారని అధికారులను పవన్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో ప్రజలు భారీగా వచ్చారని అధికారులు బదులిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్