దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 528.28 పాయింట్ల నష్టంతో 77,620.21 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.45 పాయింట్ల నష్టంతో 23,526.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.88గా ఉంది. టాటా స్టీల్, జొమాటో, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు లాభపడ్డాయి.