ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీ కష్టమే..!

58చూసినవారు
ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీ కష్టమే..!
ఏపీ రాజకీయాలు 2023 నుంచి పూర్తిగా మారిపోయాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌కులు అంటున్నారు. టీడీపీ, జనసేన కలవడంవల్ల వైసీపీ గ్రాఫ్ తగ్గిందన్నారు. ఈ రెండు పార్టీలకు బీజేపీ కూడా కలిసిందని, ఆ పార్టీ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ కేవలం 0.5 శాతం నుంచి ఒక శాతం మాత్రమే ఉంటుందన్నారు. టీడీపీ-జనసేన కలవడం అనేది రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పెద్ద ప్రభావమే చూపిందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గంటూరు జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చెరుసగం పంచుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్