ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని కొత్తగా తానే కనుగొన్నట్టు పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని అన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని వ్యాఖ్యానించారు.