వైసీపీ ఎంపీ అభ్యర్ధికి ఇంటిపోరు

65చూసినవారు
వైసీపీ ఎంపీ అభ్యర్ధికి ఇంటిపోరు
ఓ వైసీపీ ఎంపీ కుమారుడు ఎట్టి పరిస్ధితుల్లోనూ త‌న తండ్రికి ఓటేయొద్దంటూ ప్రచారం చేస్తున్నాడు. మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్‌ ప్రచారం చేస్తున్నారు. ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ చిత్రంలో ‘‘కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్