మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన సోదరుడు బొత్స లక్ష్మణరావు షాక్ ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీన లక్ష్మణరావు జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిని కలిసి ఆయన భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల్లో కూడా లక్ష్మణరావు కూటమి విజయానికి కృషిచేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల ఎమ్మెలై టికెట్ కోసం ఇప్పటి నుండే లక్ష్మణరావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.