కడప జిల్లా జమ్మలమడుగు ఎత్తపు వారి కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద బుధవారం సంపూర్ణ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐసీడీయస్ అధికారులు గర్భిణీలు, పాలిచ్చే తల్లులతో సమావేశం నిర్వహించారు. హాజరైన వారందరికీ పోషకాహారంపై అవగాహన కల్పించి, పోషకాహారపు ఆహారాల ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో సీడీపీఓ రాజేశ్వరి దేవి గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు 100% పోషక ఆహారం అందించడం ఎంత ముఖ్యమో ప్రస్తావించారు.