పులివెందుల: రోడ్లపైన మురికి నీటితో ఇబ్బందులు

67చూసినవారు
పులివెందుల: రోడ్లపైన మురికి నీటితో ఇబ్బందులు
పులివెందుల మండలం పరిధిలోని కొత్తపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. రోడ్ల పైన మురుగునీరు ప్రవహించడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని శుక్రవారం గ్రామస్థులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దోమకాటుకు గురై వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు