పులివెందుల విద్యార్థినుల ప్రతిభ
ఈనెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మైసూర్లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపులో పులివెందుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన తెలుపుతూ కళాశాలకు చెందిన నందిని, జ్యోత్స్నలు డ్రాయింగ్, గేమ్స్, తదితర ప్రదర్శనలలో పాల్గొని ప్రతిభ కనబరిచి మెమొంటోలను పొందారన్నారు.