టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్‌డే సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే పక్కనే కావడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది 77 అడుగుల ఎత్తుతో పెట్టగా.. ఈ సారి 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఘనంగా ధోనీ జన్మదిన వేడుకలు నిర్వహించారు.