బైక్‌తో యువకుడి వీరంగం.. డీఎస్పీకి గాయాలు (వీడియో)

50చూసినవారు
నెల్లూరులోని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద బైక్‌పై యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు తన వాహనంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు పైకి దూసుకెళ్లాడు. దీంతో డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడిని పోలీసులు ఆత్మకూరు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్