మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు

58చూసినవారు
మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు
మణిపూర్‌ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో అధిక శాతం హింసాకాండలో ప్రభావితమైన బాధితుల నుండి వచ్చాయని అన్నారు. మరికొన్నింటిని కొండ, లోయ ప్రాంతాల్లోని పౌర సమాజ బృందాలు దాఖలు చేశాయని చెప్పారు. హింస ఇతర సంబంధిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు మణిపూర్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలో స్పందన కోరనుందని ఆ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్