శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

58చూసినవారు
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమల కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక, సోమవారం శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా, 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :