నిఫా వైరస్.. లక్షణాలు ఇవే!

80చూసినవారు
నిఫా వైరస్.. లక్షణాలు ఇవే!
కేరళలోని నిఫా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ‘ఫ్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు వాలిన పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిఫా సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఇది కొవిడ్ కంటే డేంజర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్