షూటర్లతో తండ్రిని చంపించిన 16 ఏళ్ల కొడుకు

566చూసినవారు
షూటర్లతో తండ్రిని చంపించిన 16 ఏళ్ల కొడుకు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్‌ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులతోపాటు ఆ బాలుడ్ని అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :