hMPV వైరస్ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. సోమవారం దేశ వ్యాప్తంగా 7 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య 9కి చేరింది. పాజిటివ్ వచ్చిన ఏడేళ్లు, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, తమిళనాడులో 2, మహారాష్ట్రలో 2 కేసులు నమోదయ్యాయి.