ప్రపంచ ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుతున్నాయి. దీంతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలవబోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. అజర్‌బైజాన్ రాజధాని బాకులో కాప్ 29 సదస్సులో ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం ముందుకంటే 1.54 డిగ్రీలు అధికంగా ఉందని తెలిపింది. 2023లో ఎన్నడూలేని రీతిలో మంచు 1.2 మీటర్ల మేర కరిగిపోయిందని పేర్కొంది.