ఇండో-పాక్ యుద్ధ కాలం నాటి 27 మోర్టార్ షెల్స్ లభ్యం

53చూసినవారు
ఇండో-పాక్ యుద్ధ కాలం నాటి 27 మోర్టార్ షెల్స్ లభ్యం
పశ్చిమ త్రిపుర జిల్లాలో 1971 ఇండో-పాక్ యుద్ధ కాలానికి చెందిన మొత్తం 27 మోర్టార్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దులాల్ నామా ఇంటి వద్ద కూలీలు చెరువు తవ్వుతుండగా.. ఈ మందు గుండ్లు బయటపడ్డాయి. తొలుత 12 మోర్టార్ షెల్స్ లభ్యమయ్యాయని, ఆ తర్వాతి తవ్వకాల్లో మరో 15 దొరికాయని పోలీసులు తెలిపారు. సుమారు 50 సంవత్సరాల నాటివిగా అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్