ఒంటరి మహిళల కోసం జపాన్ ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. జపాన్‌లోని పల్లె ప్రాంతాల్లో యువకులతో పోలిస్తే యువతుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమవుతోంది. దీంతో జపాన్ ప్రభుత్వం టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న ఒంటరి మహిళలకు ఛార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాల రూపంలో 6 లక్షల యెన్‌లు, మన కరెన్సీలో రూ.3.45 లక్షలు ఇవ్వాలని భావించింది. కానీ ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది.