భారత్‌-మయన్మార్‌ మధ్య కంచె కోసం రూ.30 వేల కోట్లు

78చూసినవారు
భారత్‌-మయన్మార్‌ మధ్య కంచె కోసం రూ.30 వేల కోట్లు
భారత్ సరిహద్దు దేశమైన మయన్మార్‌ నుంచి అక్రమ వలసలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రెండు దేశాల మధ్య కంచెను నిర్మించనున్నట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. అయితే ఈ సరిహద్దులో 1600 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌కు దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత పోస్ట్