భారత్‌లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలని సూచించింది. 2050 నాటికి ప్రపంచ పిల్లల జనాభాలో 15 శాతం భారత్, చైనా, నైజీరియా, పాకిస్థాన్‌లోనే ఉంటారని తెలిపింది. ‘మారుతున్న ప్రపంచంలో పిల్లల భవిత’ పేరిట బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది.